ఎందుకంటే తెల్లారి లెగిస్తే మళ్ళీ ఇంట్లో మొఖం మొఖం చూసుకోవాలి. అంటూ చలోక్తులతో సరదాగా రక్తికట్టించారు... మంగళవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన షూట్ అవుట్ ఎట్ అలైర్.. అనే వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా మాట్లాడారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ5 తెలుగు సిరీస్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్.. ఈనెల 25న జి5 ఓటీటీలో విడుదల కానుంది.
సుశ్మిత మాట్లాడుతూ... ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్.. గొప్పగా నటించారు. మంచి కంటెంట్‌తో తీసిన సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది. నాకు ఎంతోమంది సపోర్ట్ చేశారు. అందుకే అనుకున్న టైంలో జీ5కు అందించగలిగాం. దీనికి పనిచేసిన టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, నందినీరాయ్, తేజ, సందీప్ సాహు, గాయత్రి గుప్త తదితరులు నటించారు. కెమరా: అనిల్ భండారీ, నిర్మాతలుః సుశ్మిత కొణిదెల, విష్ణు, దర్శకత్వం: ఆనంద్‌రంగ.