నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెర్సీ. నాని సరసన శ్రద్ధా శ్రీనాధ్ నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ నిర్మించిన జెర్సీ చిత్రం ఈ నెల 19న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... జెర్సీ థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 12న, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 15న ఉంటుంది.
మోస్ట్ బ్యూటీఫుల్, హార్ట్ టచింగ్, మ్యాజికల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్ జెర్సీ. ఈ నెల 19న విడుదల కానుంది. నేను సినిమా కోసం తగ్గలేదు. సినిమా చేయడం వల్ల తగ్గాను. క్రికెట్ ఆడి, దానికి ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకే తెలియకుండా తగ్గాను. 36 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా నటిస్తుండటం వల్ల కాస్త లావవుదామని అనుకున్నా. కానీ నాకే తెలియకుండా తగ్గాను.
నన్ను నేను మర్చిపోయి ఇటీవల ఈ సినిమా చూశా. 20 సార్లు సినిమా చూశా. ఇందులో నాతో పాటు ప్రతి ఒక్కరూ నానిని మర్చిపోయి, కేవలం అర్జున్‌ని మాత్రమే చూస్తారు. ఆర్టిస్టుగా నాకు ఎక్స్‌ట్రీమ్ శాటిస్‌ఫేక్షన్ వచ్చింది. అందరూ ఈ సినిమాకు క్రికెట్ ప్రధానమని అనుకుంటున్నారు కానీ... అంతకుమించిన సర్‌ప్రైజ్ ఉంది. ఇది మోస్ట్ ఎమోషనల్ సినిమా.
నేను ఇంతకుముందు ఏ సినిమా చేసినా సరే… ఇదే ఆఖరి రోజు అనే ఫీలింగ్ ఉండేది తప్పితే, అరే.. ఈ రోజు ఇది ఆఖరి రోజా… అని పెద్దగా ఎప్పుడూ ఫీల్ కాలేదు కానీ... ఈ సినిమాకు మాత్రం ఎవరో నాతో పాటు కలిసి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్‌కి సెండాఫ్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది. నా కెరీర్‌లో నేను చేసిన సినిమాల్లో ఆఖరి రోజు ఇంత బరువుగా ఇంటికి వెళ్లింది జెర్సీ సినిమాకే. ఈ సినిమాలో 86, 96, 2018 సంవత్సరాలను చూపించాం. ఎంతో ఇష్టంతో చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నా గట్టి నమ్మకం అన్నారు.