- ప్రతి మూవీ నాకు నమ్మకం కలిగాకే చేస్తాను. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు 'సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు' అని ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో స్క్రిప్ట్ చదివేటప్పుడు దేవదాసి క్యారెక్టర్ ఎలా చేయాలి అనేదాని కంటే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్పడం నచ్చింది. వేరే సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను సైకాలజీ పరంగా చేశాను.
- నాకు ఎందులో ప్యాషన్ ఉంది అంటే నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి అనుకుంటున్నా.
- 'శ్యామ్ సింగ రాయ్ ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు కృతజ్ఞతతో వచ్చాయి. అది మాత్రమే కాదు...ఆ పాట అనురాగ్ కులకర్ణి పాడారు. డాన్స్ చేశారు. మనం ఒక కళను ఎంజాయ్ చేయడమే పెద్ద ఇది. మనకు ఏమీ రాకున్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ చూసి ఎమోషనల్ అయ్యాను. నా బ్రెయిన్ లో నేను మామూలు సాయి పల్లవినే. అయితే...నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను. నేను రుణపడ్డాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ థాంక్స్ చెప్పాలని అనుకున్నాను.