విజ‌య‌శాంతి త‌ర‌హాలో పాత్ర‌లు చేయాల‌నుంది- నట్టి కరుణ

సోమవారం, 24 జనవరి 2022 (16:45 IST)
Natti Karuna
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది.  తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు బాషలలో ఈ చిత్రాన్ని జనవరి  28న థియేటర్లలో  భారీగా  విడుదల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా క‌థానాయిక నట్టి కరుణ ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు.  
 
- న‌టిగా తొలి సినిమాకు ఎవ‌రైనాప్రేమ‌క‌థ‌లనే ఎంచుకుంటారు. అలా కాకుండా న‌ట‌న‌కు పూర్తి అవ‌కాశం వున్న పాత్ర‌లు చేయ‌డం అరుదు. అలాంటి పాత్ర చేయాల‌నే దెయ్యంతో స‌హ‌జీవం చేశాను. ఈ క‌థ‌లో కొంచెం ల‌వ్ కూడా వుంటుంది. అలాగే యాక్ష‌న్‌, అరుపులు, మిడిల్ క్లాస్ అమ్మాయిగా మ‌రో కోణం కూడా ఈ క‌థ‌లో క‌నిపిస్తుంది. 
- న‌ట‌న‌ను ఎక్క‌డా నేర్చుకోలేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో యూట్యూబ్‌లో కొన్ని సాంగ్స్ చేశాను. అది చాలా మందికి న‌చ్చింది. ఇది నాకోసం రాసిన క‌థ‌. షూటింగ్ ముందు కొద్దిరోజులు వ‌ర్క్‌షాప్ కూడా ఈ సినిమాకు చేశాను.
- ఈ క‌థ హైద‌రాబాద్‌లో జ‌రిగిన వాస్త‌వ క‌థ‌. అది సెస్సేష‌న్ న్యూస్ రూపంలో వ‌చ్చింది. అయితే కథ‌నంలో కొన్ని ట్విస్ట్‌లు వుంటాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వుంటాయి. 
- ఇది లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌. స్నేహితులు వుంటారు. అందులో కోటి కుమారుడు రాజీవ్ ఒక‌రు. నాకు జోడిగా ఎవ‌రూ వుండ‌రు. 
- ఈ సినిమా చేయ‌డ‌మే ఛాలెంజింగ్‌. యాక్ష‌న్ బాగా అనిపించింది. ఐదు అంత‌స్తుల‌నుంచి దూక‌డం, కారుమీద నిల‌బ‌డి రోప్‌లేకుండా కారు గిర్రున తిరుగుతుండ‌డం ..వంటివి ఛాలెంజ్ గా అనిపించాయి.
- ఈ సినిమాలో రెండు పాట‌లుంటాయి. న‌ట‌న‌కంటే డాన్స్ చేయ‌డం క‌ష్ట‌మ‌నిపించింది. ఎందుకంటే క‌శ్మీర్‌లో మైన‌స్ డిగ్రీల‌లో సాంగ్ చేసేట‌ప్పుడు కాళ్ళు స‌హ‌క‌రించ‌లేదు. 
- ఫైన‌ల్ అవుట్ పుట్ చూశాక‌. అంద‌రూ మెచ్చుకున్నారు. మావార‌యితే నీకు క‌రెక్ట్ క‌థ అని కామెంట్ చేశారు. సినిమా చూశాక న‌టిగా నాకు సంతృప్తి నిచ్చింది. 
- ఈ సినిమా త‌ర్వాత కూడా లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లే చేయాల‌నుకుంటున్నా. కొన్ని క‌థ‌లు వింటున్నాను. ఈనెల 28న క‌థ‌లు వింటాన‌ని చెప్పాను.
- నేను ఏ సినిమా చూసినా అందులోని క‌థానాయిక‌ల హావ‌భావాల‌ను ప‌రిశీలిస్తాను. సాయిప‌ల్ల‌వి యాక్ష‌న్ సీన్స్‌, అనుష్క బాడీలాంగ్వేజ్‌, స్మైల్‌, లుక్స్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఎలా చూడాలి వంటివ‌న్నీ ప‌రిశీలిస్తాను. న‌టిగా డ్రీమ్ రోల్ అనేది విజ‌య‌శాంతి త‌ర‌హాలో చేయాల‌ని వుంది.
- నాన్న‌గారు, టెక్నీషియ‌న్స్ అంతా తెలిసిన‌వారు కావ‌డంతో కెమెరాముందు ఎక్క‌డా బెరుకు అనిపించ‌లేదు. నాన్న‌గారిలో నిక్క‌చ్చిత‌నం, డెడికేష‌న్ నేను నేర్చుకున్న అంశాలు.
- నిర్మాత‌గా, న‌టిగా వున్న నాకు ద‌ర్శ‌కురాలు అవ్వాల‌నే ఆలోచ‌న‌కూడా లేదు.
ఈ సినిమాకు ర‌విశంక‌ర్ బాణీలు స‌మ‌కూర్చారు. దెయ్యం సినిమా కాబ‌ట్టి బ్యాక్‌గ్రౌండ్ సంగీతం బాగుండాలి. దాన్ని బాగా స‌మ‌కూర్చారు.
- ఈ క‌థ‌లో అమ్మ‌వారికి, దెయ్యం మ‌ధ్య వుండే స‌న్నివేశాలు హైలైట్ అవుతాయి. ఒక్కో సంద‌ర్భంలో ఒళ్ళు గ‌గుర్పాటు క‌లిగిస్తూ ప్రేక్ష‌కుడిని ఇన్‌వాల్వ్ చేస్తాయి. ఈ త‌ర‌హా సినిమాలు చూసే ప్రేక్ష‌కుల‌కు అద్భుతంగా న‌చ్చే సినిమా అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను అని ముగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు