గురువారంనాడు ఎ.పి. ప్రభుత్వం థియేటర్లపై ఉక్కుపాదం మోపింది. థియేటర్లు ప్రమాణాలతో లేవనీ, శుచి శుభ్రతతోపాటు టాక్స్ కూడా సరిగ్గా కట్టడంలేదని లాజిక్‌తో దాదాపు యాభై థియేటర్లు మూసివేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎగ్జబిటర్లు మాట్లాడుతూ, స్వచ్చంధంగా మరో 20 థియటర్లను మేమే మూసివేస్తామని ప్రకటించారు.
ఈ విషయమై వైజాగ్లోని ఎగ్జబిటర్, ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ, గతంలో నేను చెప్పినట్లే ఇప్పుడు ప్రభుత్వం చర్యలు వున్నాయనీ, అందరూ ఒక్కతాటిపై వుండాల్సిన అవసరం ఎంతైనా వుందని పేర్కొన్నారు. థియేటర్‌కు టాక్స్ అనేది రెండు సంవత్సరాలు, మూడు, ఐదు సంవత్సరాల కాలపరిమితి ఎవరి అనుకూలతను బట్టి వారు కట్టుకుంటారు. కానీ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. కానీ సంబంధిత అధికారులనుంచి నోటీసులు కానీ, ఇన్‌ఫర్ మేషన్ కానీ రాదు. కానీ కట్టలేదని సాకుతో మూసేయడం జరుగుతుంది. ఇలా గత కొన్నేళ్ళుగా జరుగుతుంది. ఫైనల్ గా అధికారులు లాలూచితో లేట్‌గా కట్టిగా ఏమీకాదు. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు విరుద్ధంగా వుంది.
సంక్రాంతి బరిలో సినిమాలు రావడం, క్రిస్‌మస్‌కు సినిమాలు రావడం కూడా ఎ.పి. ప్రభుత్వం తీరుపట్ల ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయంలో నాని చాలా టెన్సన్‌గా వున్నాడు. రేపు ఆయన సినిమా శ్యామ్ సింగరాయ్ విడులకాబోతుంది. ఇదే తీరు ఇలానే కొనసాగితే ఆర్.ఆర్.ఆర్. సినిమాకూడా ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది.
కొంతమంది ఎగ్జిబిటర్లు సమాచారం మేరకు, ఎ,బి, సెంటర్లలో థియేటర్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సి సెంటర్లలో థియేటర్లకు చాలా ఇబ్బంది. అక్కడ కొన్ని పరిమితులు వుంటాయి. వాటికి లోబడి థియేటర్లు నడుపుతారు. కనుక పెద్ద సినిమాలు సి. సెంటర్టలో విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. మరి ఈ విషయంలో సినీ పెద్దలు ఎవరు ముందుకు వచ్చి సాల్వ్ చేస్తారో చూడాల్సిందే.