మొగలిరేకులు టైంలో ప్రతి ఇంటిలోకి వెళ్లిపోయాను. అలా పేరు రావడం దేవక్రుపగా భావిస్తున్నా. నాపేరు ఎంతలా మారిపోయిందంటే.. మా స్నేహితుడి నాన్నగారు చివరిస్టేజీలో వున్నారు. అనారోగ్య సమస్యలతోపాటు మతిమరుపు బాగా వుండేది. ఇంట్లోవారిని కూడా గుర్తుపట్టేవారు కాదు. కానీ టీవీలో నా సీరియల్ ప్రసారం అయ్యేసరికి కుర్చీలో కూర్చుని ఆర్.కె. నాయుడు వచ్చాడా? అంటూ టీవీని చూసి చెప్పేవాడు. అలా నా పేరు బాగా గుర్తుండిపోయింది. పనిమాల నన్నుపిలిపించుకున్నారు. అలాంటి వ్యక్తి ఆ తర్వాత చనిపోయాడని తెలిసే చాలా ఫీలయ్యా.. అంతలా నన్ను గుర్తుపెట్టుకున్న ఆయన చనిపోవడం చాలా బాధేసింది.
ఇక ది 100 సినిమాపరంగా చెప్పాలంటే, సి.పి. ఆనంద్ ను పోలిన కేరెక్టర్ నా పాత్రలో వుంటుంది. పోలీసులు గర్వించే సినిమా అవుతుంది. గతంలో పోలీసు సినిమాలు వచ్చినా ఇది పూర్తి విరుద్ధంగా వుంటుంది. దానికి సీక్వెల్ గా వుంటుందని చివరిలో చెప్పాం. అనుకూలిస్తే సీక్వెల్ చేస్తాం అన్నారు.