కానీ సికింద్రాబాద్ లో ఫుడ్ అధికారులు వచ్చినప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయం. హోటల్ చాలా బిజీగా వుంటుంది. ఆ టైంలో అన్నీ చెక్ చేసినా ఎటువంటి తప్పు దొరకలేదు. ఫైనల్ గా ఓ డబ్బా చూపించి దీనిపై ఎక్సపైరీ డేట్ లేదు అన్నారు. అది చిట్టి ముంతల బియ్యం డబ్బా. అలాగే వంటగదిలో ఓ చోట నీళ్ళు వున్నాయని చెప్పారు. బిజీ టైంలో అక్కడ కొద్దిపాటి నీరు వుండడం సహజం. అక్కడ జరిగింది రెండు శాతం అయితే, వందశాతం తప్పు జరిగిందని కొంతమంది తెగ రాసేశారు.
విశేషం ఏమంటే, ఆ రోజునుంచి హోటల్ బిజినెస్ బాగా అభివ్రుద్ధి చెందింది. మరి ఫుడ్ బాగోకపోతే ఇంత బిజినెస్ రాదుగదా అంటూ.. సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు. ఈ శుక్రవారం ఆయన ధనుష్ తో కలిసి నటించిన సినిమా రాయన్ విడుదల సందర్భంగా జరిగిన చర్చా గోష్టిలో ఈ మాటలు చెప్పారు.