కమిట్మెంట్ ఇస్తే ఓ రేటు.. ఇవ్వకపోతే మరో రెమ్యునరేషనా? ఘాటుగా రిప్లై ఇచ్చిన అనన్య నాగళ్ల (Video)

ఠాగూర్

శుక్రవారం, 18 అక్టోబరు 2024 (21:22 IST)
ఇటీవలికాలంలో చిత్రపరిశ్రమలో బాగా వినిపిస్తున్న పేరు క్యాస్టింగ్ కౌచ్. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్‌కు అంగీకరించాల్సిందేనంటూ అనేక మంది హీరోయిన్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నే యువ నటి అనన్య నాగళ్లకు ఎదురైంది. హీరోయిన్లు కమిట్మెంట్‌కు అంగీకరిస్తే ఒక పారితోషికం, కమిట్ కాకుంటే మరో రకమైన రెమ్యునరేషన్ ఇస్తారా అని ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్న సంధించారు. దీనికి హీరోయిన్ అనన్య నాగళ్ల చెంప ఛెళ్లుమనేలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఈ సంభాషణ ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. 
 
"పొట్టేల్" చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో అనన్య నాగళ్ళకు ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్న వేస్తూ, "తెలుగు అమ్మాయిలు సినీ పరిశ్రమకు రావాలంటే చాలా భయపడతారు. దానికి కారణం క్యాస్టింగ్ కౌచ్. ఇది వాస్తవం. సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా, నటిగా అవకాశం రావాలంటే ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. వేరే ఇండస్ట్రీలో అలా అడగరు. మీరు చేసే సైన్ అగ్రిమెంట్‌లో కూడా కమిట్మెంట్ ఉంటుందా? కమిట్మెంట్ ఇస్తే ఒక రెమ్యునరేషన్, ఇవ్వకపోతే మరో రెమ్యునరేషన్ ఉంటుందట కదా.. నిజమేనా అంటూ ప్రశ్నించారు. 
 
దీనికి హీరోయిన్ అనన్య నాగళ్ల ఘాటుగానే సమాధానమిచ్చారు. "మీరు ఇంత హండ్రెండ్ పర్సెంట్ కన్‌ఫర్మ్‌గా ఎలా అడుగుతారు. మీరు అడిగేది చాలా రాంగ్. ఏ పరిశ్రమలో అయినా నెగెటివ్, పాజిటివ్ అనే రెండు పార్శ్వాలు ఉంటాయి. కానీ, అందరూ నెగెటివ్‌నే తీసుకుంటారు. కానీ మీరు అనుకున్నట్టుగా సినీ పరిశ్రమలో అలా ఉండదు. నాకు ఇప్పటివరకు ఇలాంటి అనుభవమే ఎదురుకాలేదు. అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ అడగటం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్. మీరు అనుభవరాహిత్యంతో ప్రశ్న వేశారు.. నేను అనుభవంతో చెబుతున్నా. మీరు అనుకుంటున్న విషయం రాంగ్" అని అనన్య నాగళ్ల స్పష్టం చేశారు. 

 

#AnanyaNagalla slams the about casting couch & commitment at #tollywood industry.

Power of Telugu Actress ❤‍????pic.twitter.com/ImFEkjqSM8

— Telugu Bit (@telugubit) October 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు