Immanuel vs Poorna- రష్మీకి ఏమైంది?

మంగళవారం, 31 మే 2022 (16:18 IST)
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ వారం యాంకర్ గా సుడిగాలి సుధీర్ కనిపించకపోవడంతో అతని స్థానంలో రష్మీ యాంకర్‌గా సందడి చేశారు.
 
ఇక ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్ పూర్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా పూర్ణ ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది రెచ్చిపోయి పూర్ణ గారు హగ్ కావాలని అడిగారు. దీంతో పూర్ణ ఈ హగ్గులు ఇవ్వలేక ఢీ వదిలి ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడానా అంటూ ఆది పై సెటైర్ వేశారు.
 
అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ వేసే మగవారిని వేదికపైకి ఆహ్వానించారు. అదేవిధంగా ప్రేక్షకుల సరదా కోసం తాము లేడీ గెటప్స్ వేయటం వల్ల సమాజంలో చులకన భావంతో చూస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇలా ఈ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఇమ్మానియేల్ హీరోయిన్ పూర్ణను తాకాడు. ఇమ్మానియేల్ ఇలాగ తనని తాకడంతో హీరోయిన్ పూర్ణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో రష్మీ అక్కడే నిలబడి ఉండగా ఒక్క సారిగా సొమ్మసిల్లి కిందపడిపోగా ఆటో రాంప్రసాద్ తన కింద పడిపోకుండా పట్టుకున్నారు. 
 
అయితే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా.. లేదా ఎపిసోడ్‌పై హైప్ పెంచడం కోసం ఇలా ప్రోమో కట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు