ట్రైలర్‌లో ఏముందంటే
ఏనుగులు మనకంటే ఎంతో తెలివైనవి. ఎంతో భావోద్వేగం కలవి.. అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో కొంతమంది తమ స్వార్థం కోసం ఏనుగులను బంధించిన తర్వాత అయ్యో..! ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగిందే అంటూ రానా అవేదనతో చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ తర్వాత ఓ విలేకరి వచ్చి రానాను కాప్షన్‌కోసం ఏమి జరిగింది అని అడుగుతుంది.
ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. చాలా అంటూ ఆవేశంగా వెళ్ళిపోతాడు. తెలుగులో అరణ్య పేరుతో వస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లోనూ అలరించనుంది. హిందీలో హథీ మేరే సాథి, తమిళంలో కాదన్ పేర్లతో విడుదల కానుంది. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, జోయా హస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు. చిత్రీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.