తిరుపతిలో ఎన్‌.టి.ఆర్‌. రాజుకు చీఫ్ జస్టిస్ రమణ స‌న్మానం

శుక్రవారం, 10 జూన్ 2022 (15:03 IST)
NTR Raju, Chief Justice Ramana, Daggubati Purandeswari
తిరుపతిలో యన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ నాయకులు అభిమానులు అనేక మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ రమణ గారితో పాటు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్) కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.అక్కడ జరిగిన అశేష జనసంద్రంలో ఆమె మాట్లాడుతూ తిరుపతి అంటే ఎన్టీఆర్‌ గారికి ఎంత ఇష్టమో అలాగే యన్టీఆర్ రాజు అంటే అంతే ఇష్టం.అందుకే ఈ రోజు ఇక్కడ నాన్నగారి శత జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాము ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సినీ రాజకీయాలలో ఎదురులేని వ్యక్తిగా తనకంటూ ఒక గుర్తింపు ను తెచ్చుకొన్న అందాల నటుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన మా నాన్న గారిని గౌరవిస్తూ త్వరలో రూ.100 నాణేంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేశారు.అలాగే ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అన్నారు..
 
NTR Raju sanmanam
తిరుపతి లోని శతజయంతి ఉత్సవాలలో కొందరు యన్టీఆర్ అభిమానులకు దగ్గుబాటి పురంధేశ్వరి సన్మానం చేస్తూ.. తిరుపతి లోని NTR RAJU మా కుటుంబానికి చాలా ఆప్తుడు తనను మా కుటుంబంలోని వ్యక్తిగా భావించే తనకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. యన్టీఆర్ అభిమానులకు గానీ, బాలకృష్ణ అభమానులకు గాను యన్టీఆర్  అభిమాని ఎలా ఉంటాడు అనే దానికి నిదర్శనమే NTR RAJU . కాబట్టి రాజు లాంటి అభిమానిని నేను జీవితంలో చూడను చూడబోను అన్నారు 
చీఫ్ జస్టిస్ రమణ గారు .  NTR RAJU గురించి విన్నాను. అలాంటి తనకు ఈ రోజు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు