తమిళ సినీ పరిశ్రమకు చెందిన వాడు అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. కూలీగా, కార్పెంటర్‌గా, బస్ కండక్టర్‌గా పనిచేసిన రజనీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి సూపర్‌స్టార్‌గా ఎదిగారు.
రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు
. తన సినిమాలతో ఎందరో దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
రజనీకాంత్ ఆస్తుల విలువ ఎంత?
ఫోర్బ్స్ మ్యాగజైన్ 2010లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తింపు పొందారు. అతని నికర విలువ 52 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 430 కోట్లు. గత కొంత కాలంగా రజనీకాంత్ రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సినిమా బాగా రాకపోతే అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవారు.