ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.3గా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుండగా హీరో నాగశౌర్య కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత హైదరాబాద్ చేరుకుని రెస్ట్ తీసుకున్నారు. డాక్టర్ల సలహా మేరకు చిన్న సర్జరీ జరిగింది. ఇటీవల తను నటించిన ఓ బేబీ ఫంక్షన్‌కి హాజరయ్యారు.
యాక్సిడెంట్ అయిన తరువాత మొదటిసారిగా ఓ బేబి ఫంక్షన్‌కి మాత్రమే వచ్చారు. కాలు జాయింట్ దగ్గర నరాలు చిట్లడంతో దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ.. తను నటించిన చిత్రం వేడుకకు హాజరు కావటం తన ధర్మం అని భావించిన నాగశౌర్య ఓ బేబి ఫంక్షన్‌కి హాజరు కావటం జరిగింది.
ఛలో లాంటి చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర సమర్పకుడు శంకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జిలు చిత్ర యూనిట్‌ని ఫ్యామిలి మెంబర్స్‌లా చూసుకుంటున్నారు.
నాగశౌర్యకి యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్న యూనిట్ సభ్యులు హీరోని పర్సనల్‌గా కలిసి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు రమణ తేజ విజన్‌కి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐరా క్రియేషన్స్ హస్పిటాలిటికి కేరాఫ్ అడ్రెస్‌గా టాలీవుడ్‌లో పేరుంది. దానికి తగ్గట్టుగానే వారి ప్రేమానురాగాలు యూనిట్ మొత్తంమీద చూపిస్తారు. ఈ చిత్రంలో నాగశౌర్యకి జంటగా మెహరీన్ నటిస్తుంది.