ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

సెల్వి

బుధవారం, 4 డిశెంబరు 2024 (19:03 IST)
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. పాట బంపర్ హిట్. యూత్ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో వింటూ పాడుతూ తెగ ఎంజాయ్ చేశారు. గీత గోవిందం సినిమాలోని ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబోలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. పాటల నుంచి సినిమా వరకు అదరగొట్టింది. 
 
ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్‌లలో ఎక్కడ చూసిన ఈ సాంగ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలై సంవత్సరాలు గడిచినా.. ఈ పాట గురించి ప్రస్తుతం వైరల్ టాక్ వస్తోంది. విషయం ఏంటంటే.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. పాటకు ఓ చిన్నారి చేస్తున్న నృత్యానికి సంబంధించిన వీడియో గత వారం రోజులుగా ట్రెండ్ అవుతోంది. డ్యాన్స్ మాస్టర్‌తో ఆమె చేసే నృత్యానికి సంబంధించిన వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... పాటకు తగిన నృత్యంతో పాటు ఆమె చేసే హావభావాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెలుపు, ఎరుపు రంగు వోనీ కట్టి.. చిన్నారి చేసే డ్యాన్స్‌కు వ్యూస్, కామెంట్స్ పేలుతున్నాయి. 

Her facial expressions just stole my heart ♥️ pic.twitter.com/POxJOgEueo

— Priyanka dhakad???????? (@dhakadgirl8) December 3, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు