సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ బాలయ్య పండుగ అంటూ వినూత్న నిరసన

డీవీ

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (08:51 IST)
Software employyes balayya panduga
గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఎ.పి. ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వెంటనే దేశవిదేశాలలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హైదరాబాద్ లో నిరసన తెలిపారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలోని హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సరికొత్తగా ఆనందంతో వినూత్న నిరసన తెలిపారు. తమ యాజమాన్యాన్ని సెలవు కావాలని కోరుతూ హైటెక్ సిటీలో ప్ల కార్డ్ లు పట్టి జై బాలయ్య అనే నినాదాలు రాసి ఉత్సాహంలో పాల్గొన్నారు. 

దీనికి కారణం బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4లో చంద్రబాబుతో బాలయ్య చేసిన ఇంటర్వూను అదేరోజు చూడాలని అందుకు తగిన సమయం కావాలని సాఫ్ట్ వేర్ యాజమాన్యాన్ని కోరుతూ ఇలా ప్రదర్శనలో పాలుపంచుకున్నారు.
 
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె. సీజన్ 4 సీజన్ 4 ప్రీమియర్ కోసం సెలవును అభ్యర్థించడం ద్వారా హైదరాబాద్ ఉద్యోగులు కొత్త ఆవిష్కరణలను తదుపరి స్థాయికి తీసుకెళ్లారు. ఎపిసోడ్ 1ని @ahavideoin OTTలో అక్టోబరు 25న, రాత్రి 8.30కి మాత్రమే చూడటానికి సిద్ధంగా ఉంది. అందుకే ఎంప్లాయీస్ అంతా బాలయ్యపండుగ అంటూ ప్లకార్డ్  లతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఒకప్పుడు రజనీకాంత్ సినిమా కోసం విదేశాల్లోనూ, చెన్నైలోనూ సెలవదినంగా ప్రకటించుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగులు ఈసారి ఓటీటీలో ప్రసారం అయ్యే ప్రోగ్రామ్ కోసం ఇలా చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు