"పుష్ప" ఖాతాలో ఆల్‌టైమ్ రికార్డు.. ఏంటది..?

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:35 IST)
pushpa
"పుష్ప" ఖాతాలో ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్‌ 7న బన్ని పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రని పరిచయం చేస్తూ ఓ వీడియో పంచుకుంది చిత్ర బృందం. 
 
'ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌' పేరిట విడుదలైన ఈ వీడియో తాజాగా రికార్డు సృష్టించింది. అనతికాలంలో (తెలుగు పరిశ్రమకు సంబంధించి) 50 మిలియన్‌ వీక్షణలు సొంతం చేసుకున్న వీడియోగా నిలిచింది. ఇందులో 'తగ్గేదే లే' అంటూ బన్ని చెప్పిన డైలాగు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 
 
ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత బన్నితో సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు