''లక్ష్మీస్ ఎన్టీఆర్'' ద్వారా సినిమాల్లోకి వర్మ మేనకోడలు..?

బుధవారం, 6 మార్చి 2019 (17:43 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీ నుంచి సినిమా రంగంలోకి ఆయన మేనకోడలు అడుగుపెట్టనుంది. తన మేనకోడలుతో కలిసి దిగిన ఫోటోలు వర్మ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వర్మ ఆమె కాస్టూమ్ డిజైనింగ్ టాలెంట్ గురించి పొగడ్తలు గుప్పించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి శ్రావ్యవర్మ కాస్టూమ్ డిజైనర్‌గా పని చేసినట్లు సమాచారం. 
 
శ్రావ్యా వర్మతో కండలు ప్రదర్శించే విషయంలో పోటీ పడి, ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ వర్మ మరో ఫోటో షేర్ చేశారు. సాధారణంగా వర్మ నుంచి ఎప్పుడూ ఇలాంటి సరదా పోస్టులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన పోస్టులు కనిపించవు. ఉన్నట్టుండి ఇలాంటివి దర్శన మివ్వడంతో అభిమానులు షాకవుతున్నారు. 
 
కాగా ఎన్టీరామారావు జీవితంలోని వివాదాస్పద కోణాన్ని ''లక్ష్మీస్ ఎన్టీఆర్''గా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, చివరి నిమిషంలో ఆయన ఎదుర్కొన్న మానసిక క్షోభ, వెన్ను పోటు పర్వం లాంటి కీలక అంశాలను ఇందులో చూపించబోతున్నారు. 
 
ఈ చిత్రం మార్చి 22న విడుదలవుతున్న నేపథ్యంలో తన ట్విట్టర్ పేజీ ద్వారా కొన్ని రోజులుగా సినిమాను ప్రమోట్ చేస్తూ బీజీగా గడుపుతున్నారు. కాగా ఈ మూవీ ద్వారా వర్మ తన మేనకోడలిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు