Pupshp 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ కు కారణం సోషల్ మీడియానే కారణమా?

డీవీ

శుక్రవారం, 17 జనవరి 2025 (15:32 IST)
Pupshp 2 Reloaded:
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ మొదటివారంలో విడుదలయి నార్త్ లో కలెక్షను షేక్ చేసింది. ఓవర్ సీస్ కూడా కొనసాగింది. ఈ సినిమా సక్సెస్ అయినా హీరోకు వ్యక్తిగత కారణాలవల్ల బయట ఫంక్షన్ చేసుకోలేకపోయాడు. కాగా, ఈ సినిమా రీలోడెడ్ వర్షన్ అంటూ  ఓ సీన్ ను ఈరోజు హైదరాబాద్ లోని కూకట్ పల్లి శివార్లో ఓ థియేటర్ లో విడుదల చేశారు. పుష్ప మొదటి భాగంలో ఓ సీన్ ను సీక్వెల్ కు కొనసాగింపుగా వుంటే బాగుంటుందని సోషల్ మీడియాలోనూ బయట ఫ్యాన్స్ అనేవి వైరల్ అయ్యాయి.
 
పుష్ప చిన్నతనంలో వుండగానే అన్నయ్య పాత్ర అజయ్ మెడలో గొలుసు లాక్కుంటాడు. పుష్ప 2 చివరి సన్నివేశంలో పుష్ప తన కుటుంబంలో అజయ్ కలుపుకున్నప్పుడు ఆ గొలుసు అజయ్ చేత పుష్ప మెడలో వేయిస్తే బాగుండేదని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఈ కామెంట్లకు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ ఏవైనా కలిసి ప్లాన్ చేశారా? కొత్తగా సీన్ చేశారా? అనేది పక్కన పెడితే ఆ సీన్ ను ఈరోజు కొత్త వర్షన్ లో థియేటర్ లో ప్రదర్శించారు. దీంతో అభిమానులు, సోషల్ మీడియా కామెంట్లకు పూర్తి న్యాయం జరిగిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. రష్మిక మందన్న నాయికగా నటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు