దక్షిణాది సినిమాల్లో మలయాళ, కన్నడ భామల హవా తొలినుంచీ నడుస్తూనే ఉంది. కేరళనుంచి సినిమా అవకాశాల బాటలో అడుగుపెట్టి నిలదొక్కుకుంటున్న భామ ఐశ్వర్యా మీనన్. కన్నడం, మలయాళ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలయాళీ భామ అనువాద చిత్రాల ద్వారా తెలుగుకు పరిచయమైంది. రెండు మూడు తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈమె ఇప్పుడు వీర చిత్రంలో కథానాయికగా ఎలాగోలా చాన్సు దక్కించుకుని షూటింగ్ కూడా పూర్తి చేసింది.
అందుకే ఆర్యతో నటించే అవకాశం కలిగిస్తే ఫ్రీగా నటిస్తానని, పారితోషికం కూడా అడగనని ఫీలర్ వదిలింది ఈ భామ. తన లక్ష్యం సిద్ధింప జేసుకోవడానికి ఆర్యతో సినిమాలు చేస్తున్న దర్శకుల గురించి ఆరా తీసి ఒక్క చాన్స్ ఇవ్వరాదూ అంటూ రాయబారం పంపుతోందని సమాచారం.