బ్యాడ్మింటన్ నేపధ్యంలో లవ్ ఆల్ సినిమా రావడం అనందంగా వుంది : పుల్లెల గోపీచంద్

బుధవారం, 16 ఆగస్టు 2023 (08:18 IST)
Love All team with Pullela Gopichand
లెజండరీ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్, ఆనంద్ పండిట్, బ్యాడ్మింటన్ ఐకాన్ పుల్లెల గోపీచంద్ సమర్పణలో కే కే మీనన్ లీడ్ రోల్ లో సుధాంశు శర్మ దర్శకత్వం వహించిన బ్యాడ్మింటన్ నేపధ్యంలో సాగే స్పోర్ట్స్  డ్రామా 'లవ్ ఆల్'. స్వస్తిక ముఖర్జీ, శ్రీస్వర, సుమిత్ అరోరా, ఆర్క్ జైన్, దీప్ రంభియా, అతుల్ శ్రీవాస్తవ, రాబిన్ దాస్ లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషించారు. దిలీప్సోని జైస్వాల్, రాహుల్ వి.దూబే, సంజయ్ సింగ్ సహ నిర్మాతలుగా ఎం.రమేష్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ద్వారా ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బంగ్లా , ఒడియాతో సహా ఆరు భారతీయ భాషలలో ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
 
ప్రెస్ మీట్ లో కే కే మీనన్ మాట్లాడుతూ..బ్యాడ్మింటన్ లెజెండ్ పుల్లెల గోపీచంద్ గారితో వేదిక పంచుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.  ఈ సినిమాలో మెయిన్ స్టార్ బ్యాడ్మింటన్. నాకు స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎప్పటి నుంచో స్పోర్ట్స్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.  
 
పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ..అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్యాడ్మింటన్ నేపధ్యంలో ఇలాంటి మంచి సినిమా రావడం చాలా అనందంగా వుంది. ఇంత అద్భుతమైన చిత్రం తీసిన ఈ చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు. ఈ సినిమా చూశాను. చాలా బావుంది. బ్యాడ్మింటన్ గురించే కాదు మొత్తం స్పోర్ట్స్ గురించి చాలా ముఖ్యమైన చిత్రమౌతుంది. స్పోర్ట్స్ ని కెరీర్ గా తీసుకోవాలా వద్దా అనే మీమాంస పేరెంట్స్ లో ఎప్పుడూ వుంటుంది. చాలా మంది తమ స్పోర్ట్స్ కలని మధ్యలోనే వదిలేసేవారు వుంటారు. ఈ సినిమా చూసిన వారు ఇది మన కలే కదా అనుకుంటారు. పిల్లల ద్వారా ఆ కలని సాకారం చేసుకోవాలని భావిస్తారు. చాలా గొప్ప సినిమా ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది. టీం అందరికీ అభినందనలు'' అన్నారు.
 
సుధాంశు శర్మ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పుల్లెల గోపీచంద్ గారు ప్రజంట్ చేయడం చాలా అనందంగా వుంది. ఆయని హృదయపూర్వక కృతజ్ఞతలు. సుప్రియ గారికి, బ్యాడ్మింటన్ గురుకుల్ కి థాంక్స్. మునుపెన్నడూ చూడని బ్యాడ్మింటన్ ని ఈ చిత్రంలో చూస్తారని నమ్మకంగా చెబుతున్నాం. బ్యాడ్మింటన్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన తర్వాత వారికి దానిపై ఆసక్తి ఏర్పడుతుందని చెప్పగలను. మనం అందరం కలసి కట్టుగా ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు