`క్షణక్షణం`లాంటి సినిమా చేయాలంటే ధైర్యం కావాలి: బన్నీ వాస్

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:55 IST)
Bunny vasu, Uday Sankar, Jiya sarma,
మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరోహీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా క్షణ క్షణం. డార్క్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. క్షణ క్షణం సినిమా ఈ నెల 26న గీతా ఫిలింస్డి స్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
బన్నీ వాస్ మాట్లాడుతూ, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు వేసుకుని చేస్తాం. కానీ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నప్పుడు నేను అది ఎక్సీపిరియన్స్ చేశాను. క్షణక్షణంతో అలాంటి ధైర్యం చేసిన వర్ల గారిని, మౌళి గారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది.

సినిమా నచ్చడంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి భిన్న‌మైన‌వి వస్తే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ పరిచయం అవుతుంది. కొత్త నటీనటులు, దర్శకులు ఇండస్ట్రీకి వస్తారు. క్షణక్షణం సినిమాను చూడమని చాలామందికి రిఫర్ చేశాను. ఉదయ్ శంకర్ ను ఆయన మొదటి సినిమా ఆటగదరా శివ నుంచి చూస్తున్నాను. విభిన్నమైన కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు. ఉదయ్ శంకర్ క్షణక్షణంతో ప్రేక్షకులను మెప్పిస్తాడని అనుకుంటున్నా. అన్నారు.
 
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ: మమ్మల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న బన్నీ వాస్ గారికి చాలా థ్యాంక్స్. సినిమా నచ్చి ఆయన తనే డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకొచ్చారు. గీతా ఫిలింస్ లో మా సినిమా రిలీజ్ కావడం గౌరవంగా భావిస్తున్నా. బన్నీ వాస్ గారు మాకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. క్షణక్షణం ట్రైలర్ చూశారు కదా ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో, సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇష్టపడి కష్టపడి సినిమా చేశాం. నాకింత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు కార్తీక్ కు థ్యాంక్స్. సంగీత దర్శకుడు కోటి గారు ఓ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.
 
దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ: బన్నీ వాస్ గారి సపోర్ట్ మర్చిపోలేం. తమన్నా గారికి కూడా థ్యాంక్స్, ఆమె ట్విట్టర్ ద్వారా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. చిన్న సినిమాను ప్రేక్షకులు చూడాలంటే కొత్తగా ఏదైనా ఉండాలి. క్షణక్షణంలో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్లు ఆకట్టుకుంటాయి. ట్రైలర్లో కొన్ని విషయాలు మేం చెప్పలేదు. అలా దాచిన వాటిలో రఘు కుంచె గారి క్యారెక్టర్ ఒకటి. ఆయన రోల్ షాకింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులకు కూడా క్షణక్షణం ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నా. డెఫనెట్ గా సినిమాను ఎంజాయ్ చేస్తారు.
 
సంగీత దర్శకుడు రోషన్ సాలూరి మాట్లాడుతూ, క్షణక్షణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేప్పుడు చాలా సార్లు బన్నీ వాస్ గారు మా స్టూడియోకు వచ్చారు. చాలా కేర్ తీసుకున్నారు. దర్శకుడు కార్తీక్ టాలెంటెడ్, మ్యూజిక్ కు స్వేచ్ఛ నిచ్చి చేయించారు. ఎలా చేస్తున్నారు, ఏంటి అని ఒక్క రోజుకూడా అడగలేదు. నా మీద అంత నమ్మకం ఉంచి మ్యూజిక్ చేయించారు అని చెప్పారు.
 
నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ, వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. ఆయన సంపాదన అంతా సినిమా మేకింగ్ మీద పెట్టేవాడు. అంత ప్యాషన్ సినిమాలు అంటే. నేను అదే ప్యాషన్‌ను ఉదయ్‌లో చూశాను. వాళ్ల నాన్న నాకు ఫ్రెండ్. మెడిసిన్ చదవమంటే సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. తను కోరుకున్న రంగంలో ముందుకు వెళ్లమని ఉదయ్ కు చెబుతున్నా. తాడో పేడో ఇక్కడే తేల్చుకో.దర్శకుడు కార్తీక్ తనకు తెలియకుండానే ఒక సూపర్ హిట్ సినిమా ఫార్ములాను క్షణక్షణం కథలో వాడాడు. కొత్తగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. అన్నారు.
 
రఘు కుంచె మాట్లాడుతూ..క్షణక్షణం అనే టైటిల్ పెట్టినప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. అది వెంకటేష్ గారి సినిమా. మేము మంచి లాక్ డౌన్ లో షూటింగ్ చేశాం. మా నిర్మాత డాక్టర్ గారు కాబట్టి ధైర్యంగా సెట్స్ కు వెళ్లే వాళ్లం. ఆయన మాకు మందులు ఇచ్చేవారు. కొత్త సినిమాలో ఏముంటుంది అనే ఆడియెన్స్ అనుకుంటారు. దాంతో కొత్త  దర్శకులు, నటులు తమ సినిమాల్లో కథలు కొత్త కాన్సెప్ట్ లతో చేస్తున్నారు. నేను ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు