ప్రేమమ్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్ ఆఫర్ వచ్చింది. యువ కథానాయకుడు నిఖిల్ సరసన ఆమె నటించనుంది. ప్రస్తుతం నిఖిల్ కథానాయకుడుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. '18 పేజెస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు.