సాహో టీజర్ వీడియో గేమట.. ఒక్క రోజుల్లోనే 60మిలియన్ల వ్యూస్‌

శుక్రవారం, 14 జూన్ 2019 (15:38 IST)
బాహుబలి హీరో ప్రభాస్ నటించిన సాహో టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్‌పై మిశ్రమ స్పందన వస్తుంది. అది విజువల్ వండర్ కాదు.. వీడియో గేమ్ అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో విచిత్రమైన రివ్యూలు ఇస్తూ, పాపులారిటీ సంపాదించుకున్న కేఆర్‌కే (కమల్ రషీద్ ఖాన్ ) సాహో గురించి సంచలనమైన ట్విట్ చేశాడు. 
 
సాహో టీజర్ ఒక వీడియో గేమ్‌లా చాలా అద్భుతంగా ఉంది. 300 కోట్లు భారీ బడ్జెట్ తో వస్తున్నా ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ ప్లాఫ్ అవుతుంది అంటూ పోస్ట్ చేశాడు. అతను చేసిన పోస్ట్ చూసి ప్రభాస్ ఫాన్స్ ఒక రేంజులో ఫైర్ అవుతున్నారు. గతంలో అట్టర్ ప్లాఫ్ సినిమాలకి సూపర్ అంటూ రివ్యూలు ఇచ్చిన నువ్వా, సాహో సినిమా గురించి మాట్లాడేది అంటూ ఘాటుగా బదులిస్తున్నారు.
 
అయితే హాలీవుడ్‌ స్థాయిలో సాహో టీజర్ వుందని మరోవైపు టాక్ వస్తోంది. ఈ టీజర్‌.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ టీజర్‌ రిలీజ్‌ అయినప్పటినుంచి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన ఒక్క రోజుల్లోనే 60మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 
 
ఇక యూట్యూబ్‌, ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.  సుజిత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు