బాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే.. ఆ ప్రేమ జంట ఎవరు?

శుక్రవారం, 28 జూన్ 2019 (11:45 IST)
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కుమారుడు, యువ నటుడితో.. హిందీ సినీ రంగంలో స్టార్ ఇంటి  కోడలు ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత కుమారుడు.. స్టార్ హౌజ్ ఇంటి కోడలు డేటింగ్‌లో వున్నట్లు పరోక్షంగా బాలీవుడ్ మీడియా పేరెత్తకుండా గాసిప్స్‌ను లేవనెత్తింది. 
 
తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన నటుడితో.. ఓ స్టార్ ఫ్యామిలీ ఇంటి కోడలు ప్రేమలో పడిందని.. భర్త వున్నా యువ నటుడితో ఆమె డేటింగ్‌లో వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడట. దీంతో ఆమెకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంకేముంది.. తనకంటే చిన్నవాడైనప్పటికీ ప్రేమలో వున్న ఆమె.. ఆ యువ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది. 
 
ఇటీవల ఆ యువ హీరో పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. తన ప్రేమను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రేమ వ్యవహారమే బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆమె ఎవరో.. ఆ యువకుడు ఎవరో మీరే ఆలోచించుకోండి.. వీళ్లెవరో కాదు.. మలైకా అరోరా, అర్జున్ కపూర్‌లేనని కొందరు అంటున్నారు.. మరి మీరేమంటారు..?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు