యువరత్న బాలకృష్ణ నటిస్తున్న 102 చిత్రం "జైసింహా". తమిళ దర్శకుడు కేఎస్. రవికుమార్ తెరెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నఠాషా దోషిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు ఈ చిత్రం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'శ్రీరామరాజ్యం', 'సింహా' చిత్రాలలో కలిసి పనిచేసిన బాలయ్య, నయనతార ముచ్చటగా మూడోసారి జై సింహాతో జతకట్టారు. దీంతో జైసింహా చిత్రం ఖచ్చితంగా హిట్టేనన్న నమ్మకంలో బాలయ్య ఫ్యాన్స్ ఉంది.