జనసేన పవన్ కల్యాణ్, వైకాపా అధినేత జగన్‌ల గురించి సినీ నిర్మాత జీవితా రాజశేఖర్ మాట్లాడారు. ముక్కుసూటిగా మాట్లాడానికి, బోల్డ్ స్టేట్‌మెంట్‌లు ఇచ్చేందుకు వెనకానని జీవితా రాజశేఖర్ తెలిపారు. పవన్ ‘జనసేన’లో జాయిన్ అవుతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆయన మంచి హీరో. కానీ, మంచి పొలిటీషియన్ కాదని తెలిపారు.
అలాగే త్వరలో తన కూతురు తెరంగేట్రం చేయబోతోందని జీవితా రాజశేఖర్ తెలిపింది. ఇక జగన్ గురించి మాట్లాడుతూ.. ‘జగన్ పార్టీ పెట్టకముందే ఆయణ్ని తిట్టేసి బయటకు వచ్చేశాం. ఆయన వైఖరి మాకు నచ్చలేదు. రాజశేఖర్‌కున్న క్రేజ్ జగన్‌ను బయపెట్టింది. రాజశేఖర్‌ను సినిమాలు చేసుకోమనండి, మీరు మాత్రమే పాలిటిక్స్‌లోకి రండని జగన్ తనతో చెప్పారు. అందుకే ఆయణ్ని వదిలేశాం. ఆయనకు అభద్రతా భావం ఎక్కువ. జగన్ అవినీతికి పాల్పడ్డాడని మేం ఫీలయ్యాం. అందుకే ఆయణ్ని అరెస్ట్ చేయడం తప్పు అని మాకనిపించలేదని స్పందించింది.