Johnny Master, Ramcharan, upsana konidala
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అని రాంచరణ్, ఉపాసన ను కలిసిన సంధర్భంగా కొరియో గ్రాఫర్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ అన్నారు. నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు. నా పుట్టినరోజు సందర్భంగా చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా అని జానీ మాస్టర్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంటికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది తెలిపారు.