దేవయానిని ఏడ్పించిన ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్ సెట్లో ఏం జరిగింది?!

బుధవారం, 29 జూన్ 2016 (15:56 IST)
దేవయానిని జూనియర్ ఎన్టీఆర్ బాగా ఏడ్పించాడు. ఇది రియల్ గానే జరిగింది. ఇంతకీ ఎక్కడ..? ఎలా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. శ్రీమంతుడు ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ షూటింగ్ ప్రస్తుతం చాలా సీరియస్‌గా జరుగుతోంది. ఒక ఎమోషనల్ సన్నివేశాన్ని దర్శకుడు యూనిట్ సభ్యులకు చెప్పి, షూట్ చేస్తున్నాడు. కొరటాల శివ చెప్పినట్లుగా ఆవేశంతో ఎన్టీఆర్ ఎమోషన్‌ సీన్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఎన్టీఆర్ నటనను యూనిట్ సభ్యులంతా సైలెంట్‌గా వింటున్నారు. అంతే షాట్ పూర్తయ్యింది. ఎన్టీఆర్‌ నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. కానీ ఆ సీన్లో నటించిన దేవయాని మాత్రం ఏడ్చింది ఏడ్చినట్లే ఉంది. 
 
ఎన్టీఆర్ ఎమోషన్‌తో చెప్పిన డైలాగ్స్ ఆమెను నిజంగానే ఏడ్పించాయి. అంతే యూనిట్ సభ్యులంతా ఆమెను సముదాయించారు. ఈ సినిమా తప్పకుండా సెంటిమెంట్, ఎమోషన్ పరంగా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ అంటోంది. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల తర్వాత ఎన్టీఆర్‌కు హిట్ ఖాయమని యూనిట్ సభ్యులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి