యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందంటే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలోనూ విశేషంగా ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్‌ను అందుకున్నారు.
ఇప్పుడు సౌత్ లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న అతికొద్దిమంది స్టార్స్‌లో ఒకరిగా తారక్ చేరిపోయాడు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం చరణ్ తో కలిసి “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కొరటాలతో కలిసి "ఎన్టీఆర్30", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "ఎన్టీఆర్31" చిత్రాల్లో నటించనున్నారు.