బాలీవుడ్‌కి టాలీవుడ్‌కి తేడా వున్నట్లే, బిగ్ బి 'పింక్'కి పవన్ 'వకీల్ సాబ్'కి తేడా వుంది.. ఉంటుందంతే, ఎందుకంటే?
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (21:41 IST)
Vakeel saab
ఒక సినిమాను యాజ్‌టీజ్‌గా తీస్తే ప్రాంతాలవారిగా వున్న పరిస్థితుల రీత్యా ఆడదు. కొన్నిసార్లు హీరోను దృష్టిలో పెట్టుకుని తీయాలి. మెగాస్టార్ చిరంజీవి తమిళ కత్తి సినిమాను ఖైదీ నెం. 150 సినిమా తీశారు. పదేళ్ళ తర్వాత రాజకీయాల నుంచి యూటర్న్ తీసుకుని సినిమాలవైపు వచ్చారు మెగాస్టార్. ఆ వేడి, ఆ చురుకుదనం వుందా! లేదా! అనేది కూడా పాయింట్. అందుకే తనలోని ఆ చురుకుదనం వుందనీ, మాస్ ప్రేక్షకుల్ని అలరించడానికి అల్లరిచిల్లరి పాటకూడా పెట్టాడు. రత్తాలు.. రత్తాలు అంటూ డాన్స్ వేశాడు. అది యూత్‌కు నచ్చింది. పెద్దలకు నచ్చదు. అయినా 60 ఏళ్ళ వచ్చినా చలాకీగా డాన్స్ వేశాడనే టాక్ అందరిలో వుంది. ఇదే విషయాన్ని టీవీ షోస్‌లో మెగాస్టార్‌ను కంపేర్ చేస్తే పలు ప్రోగ్రామ్‌లు కూడా జరిగాయి.
పింక్ వర్సెస్ వకీల్‌సాబ్!
అమితాబ్ పింక్ సినిమా, తెలుగు వకీల్‌సాబ్ సినిమాను కంపేర్ చేస్తే, రెండింటికీ చాలా వ్యత్యాసం వుంది. ఒకటి అమితాబ్ వయస్సుతగ్గ నటుడుగా నటించాడు. ఆతనికి రాజకీయాలతో సంబంధంలేదు. అలాగే తమిళంలో అజిత్ కూడా అంతే. కానీ తెలుగులో వచ్చేసరికి మూడేళ్ళ తర్వాత అజ్ఞాతవాసి సినిమా అనంతరం రాజకీయాల్లో జనసేన అనే పార్టీని పెట్టి ప్రశ్నించే తత్త్వంతో ముందుకు సాగుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్. వీటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ రాసుకున్న కథ. ఈ సినిమా టైటిల్స్‌లోకూడా కథ, మార్పులు, దర్శకత్వం అనే వేణు శ్రీరామ్ వేసుకున్నాడు. సహజంగా అయితే కథ, కథనం, అని వేసుకోవాలి.
పింక్ అమితాబ్ బచ్చన్ దృష్టిలో పెట్టుకుని ఆయన వయస్సు రీత్యా కథ రాసుకున్నాడు దర్శకుడు. అందులో హీరోయిజం వుండదు. ప్రారంభం నుంచి పూర్తివరకు అదే నడుస్తుంది. కోర్టులో ముగ్గురు అమ్మాయిలకు జరిగిన అన్యాయం మీదే చర్చ. అమ్మాయిల వేషధారణతో పాటు చాలా విషయాలకు అమితాబ్ వాదనకు దిగడు. ఏమన్నా చెబుతారా! అని జడ్జి అడిగితే, నో అంటాడు. పింక్‌లో వ్యభిచారిణి అయినా రాత్రిపూట తిరగవచ్చు. వాళ్లు ఏ డ్రెస్ వేసుకోవాలో అడగడానికి మీరెవరు అని ప్రశ్నిస్తాడు. కానీ తెలుగులో అలా చెబితే వినరు. అందుకే దర్శకుడు వేణుశ్రీరామ్ మార్పలు చేశాడు. మహిళలను పింక్ మాదిరిగా యాజ్‌టీజ్‌గా తెలుగులో చూపిస్తే మన ఆడవాళ్ళే మన సినిమాను చూడరు. ఈ విషయం నాకు బాగా తెలుసు. అందుకే మొత్తం మార్చాను. అది అభిమానులకు నచ్చింది. మహిళలకు నచ్చింది. హిట్ చేశారు. ఇంతకన్నా ఏం కావాలి అని వివరిస్తున్నారు దర్శకుడు వేణుశ్రీరామ్.
షడెన్‌గా లేబర్ కాలనీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు!
లాయర్‌గా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన పలు సమస్యలపై పోరాటం చేస్తారు. ఓసారి ఇదే లేబర్ కాలనీ గురించి రౌడీలనుంచి మమ్మల్ని కాపాడండి. అని వేడుకుంటే. కోర్టుకు వచ్చిన ఆ కాలనీ వాసులు రౌడీకి అనుకూలంగా బదులిస్తారు. బోన్‌లో నిలుచుకున్న రౌడీని, వారి బేచ్‌ను చూపిస్తూ.. మీరు ఎవరికి భయపడాల్సిన పనిలేదు. ఈ రౌడీయేనా. మిమ్మల్ని బెదిరించి, మీ సామానులు బయట గెంటింది అని వకీల్‌సాబ్ అడిగితే.. కాలనీ వాసులు ఈయనకాదు. మరెవరో అంటూ దాటేసే ధోరణిలో చెబుతారు. ఇందుకు కారణం. ఆ రౌడీని వీరిని కనుసైగలతో బెదిరిస్తాడు. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలనుంచి చూస్తున్నవే అయినా ఇంతకంటే మరో మార్గంలో చెప్పడానికి కుదరలేదన్నమాట.
ఆ తర్వాత తన ఆవేశంతో కోర్టు బహిష్కరణకు వకీల్‌సాబ్ గురి కావడం. భార్య చనిపోవడం, మెడిసిన్ వంటి మందుతో మైమరిచిపోవడం జరుగుతుంది. చివరికి ముగ్గురు అమ్మాయిల కేసు సమయానికి ఆయన బహిష్కరణ సమయం ముగిసిందన్నమాట.
దర్శకుడు తీయాలి. మాటలు చెప్పకూడదు
దర్శకుడు సినిమా తీసి చూపించాలి. మాటలు చెప్పకూడదు. నేను అలా చేశాను. ఇలా చేశాను అంటే ప్రేక్షకులు ఇచ్చే తీర్పేకదా ఫలితం. తాను చేయాల్సింది చేశానని లాజిక్ లేదా! ఓకే. మీ దృష్టిలో రైట్. దాన్ని నేను గౌరవంగా స్వీకరిస్తానని అంటున్నాడు వేణు శ్రీరామ్. సినిమా వచ్చాక దాని గురించి ఎన్ని చర్చలు జరిగినా అందులో మార్పు వుండదు. పింక్‌లానే సినిమా తీస్తే తెలుగులో ఆడదు. అందుకే చాలా సంవత్సరాలైనా తెలుగు నేటివిటీకి అనుగుణంగానే మార్చాను.
తమిళంలో రివ్యూలు బాగానే రాశారు.
అదెలాగంటే, ఇలాంటి అమ్మాయిలకు నేనెందుకు న్యాయం చేయాలి అనే కోణంలో వుంటుంది. అందుకే అమ్మాయిలపై ఫీలింగ్ రాలేదు. కానీ మన దగ్గర అమ్మాయిలు మంచోళ్ళు. వారు బట్టలు ఇలా ఎందుకు వేసుకున్నారు అనే ప్రశ్నకంటే చీడపురుగులు మన దగ్గరే వుంటే వారిని ఎందుకు మనం ప్రశ్నించకూడదు అనే కోణంలోనే నేను రాసుకున్నాను. వకీల్ సాబ్‌ను మహిళలంతా చూస్తున్నారు. ఫ్యాన్స్‌కు నచ్చింది. మంచి స్పందన వచ్చింది. జనాల్లోకి వెళ్ళింది. మేథావుల కోసం సినిమా తీయలేదు అని స్పష్టంగా వెల్లడించారు.
చెడకొడితే చూడగూడదుగదా!
'ఆర్ యూ ఏ వర్జిన్ అని పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో ఆ ప్రశ్న ప్రాసిక్యూటర్ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్) అడుగుతారు. దానికి వకీల్ సాబ్‌కు కోపం రావడానికి కారణముంది. మన కల్చర్‌లో మహిళలను కోర్టులోనైనా గౌరవంగా చూడాలి. నందగోపాల్ అడిగాడు కదా. అదే ప్రశ్న కుర్రాడిని ఎందుకు అడగకూడదు. అలా అడిగితేనే ప్రేక్షకుడికి కిక్ వుంటుంది. ఇద్దరికీ సమానం రూల్ వుండాలి కదా అనే కోణంలో రాసుకున్న డైలాగ్ అది.
పల్లవి (నివేద)తో వాదోపవాదాలు!
'పింక్'లో అమితాబ్ బచ్చన్ నిస్సంకోచంగా అడిగిన ప్రశ్నను, తెలుగు వకీల్ సాబ్ 'సత్యదేవ్' తన క్లయింట్ పల్లవిని ఎందుకు అడగలేకపోయారు? పైగా, ప్రత్యర్థి లాయర్ ఆ ప్రశ్న అడగడం మహాపరాధం అన్నట్లుగా బెంచీలు, బల్లలు విరగ్గొట్టి వీరంగం సృష్టిస్తాడు. ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి తాను వర్జిన్ కాదంటుంది.
"19 ఏళ్ల వయసులో అది ఇష్టపూర్వకంగా జరిగింది. ఎవరూ ఫోర్స్ చేయలేదు. డబ్బివ్వలేదు" అని బదులిస్తుంది. ఆమె ఇలా చెప్పడానికి సంశయిస్తుంటే, అది గ్రహించిన ఆమె తండ్రి కోర్టు బయటకు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ కల్చర్‌కు ముంబై కల్చర్‌కు చాలా వ్యత్యాసం వుందని తెలియజేప్పే అంశమే. అలా కాకుండా ఆ ముగ్గురు అమ్మాయిలు తమకిష్టమొచ్చినట్లు వుంటారని చెబితే మన లేడీసే సినిమా చూడరు. అది సభ్యత కాదు కూడా.
కథలోని పాయింట్ ఇగో వల్లే!
వకీల్‌సాబ్ సినిమా కథంతా చూస్తే, కేవలం ఇగో సమస్యపైనే కథ నడుస్తుంది. ముగ్గురు అమ్మాయిలు పార్టీ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా కార్ బ్రేక్ డౌన్ అవడం, అదే సమయంలో స్నేహితుడు కారు రావడంతో ఆ కారులో లిఫ్ట్ అడగడం. అతను మేం పార్టీకి వెళుతున్నాం. కరెక్ట్ కాదని చెప్పడం. అయినా సరే గత్యంతరం లేక అక్కడికి వెళ్ళడం జరిగిపోతుంది.
ఆ తర్వాత అక్కడ గెస్ట్‌హౌస్‌లో ఎం.పి. కొడుకు కంటికి బలమైన గాయం కావడం, ఆసుప్రతిలో చేరడం చకచకా జరిగిపోతాయి. అనంతరం ఫ్రెండ్ ఫోన్ చేసి నివేదను సారీ చెప్పమంటే చెప్పదు. ఆ ఫోన్ అంజలి అందుకుంటుంది. ఎం.పి. కొడుకు నాకు నీతో ఎటువంటి సమస్యలేదు. కేవలం పల్లవి (నివేద) సారీ చెబితే చాలు అంటాడు. కానీ అంజలి వినదు. ఎందుకు చెప్పాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇలా వాదోపవాదాలతో సమస్య రెట్టింపు అవుతుంది. దాంతో ఎం.పి. కొడుకులో మృగం బయటకు వస్తుంది. దాని పర్యవసానమే ఎం.పి. కొడుకు మరో స్నేహితుడు కలిసి కారులో పల్లవిని ఇంటి దగ్గరే కిడ్నాప్ చేయడం రేప్ చేయడం జరిగిపోతాయి. దాంతో పల్లవి పోలీసు కేసు పెడుతుంది. ఆ తర్వాత డొంగ కదిలినట్లు కేసు పెద్దదవుతుంది.
Amitab argument
కోర్టుకు సాక్ష్యాలే కావాలా?
కోర్టుకు సాక్ష్యాలే కావాలి అనేది ప్రధానమే. కానీ దానిని కూడా పరిగణలోకి తీసుకోదు కోర్టు. ఎందుకంటే ఎం.పి. కొడుకు రివర్స్ కేసు పెడతాడు. అది కూడా పల్లవి కేసు పెట్టిన తర్వాత. కానీ డేట్ మార్చి లేడీ ఎస్.ఐ. అతను ముందుగానే పెట్టాడని రాస్తుంది. అది కూడా ఎఫ్.ఐ.ఆర్.లో రెండే లైన్లు పేపర్ ఖాళీ వున్న ప్రాంతంలో రాస్తుంది. కానీ అది కూడా ఫేక్. కేసు పెట్టిన టైంలో ఆ లేడీ ఎస్.ఐ. ఓ ఫంక్షన్‌లో వుంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 15 నిముషాల్లో ఎలా వస్తుంది. మినిమం 45 నిముషాలు పడుతుంది. ఈ విషయాన్ని వకీల్‌సాబ్ గట్టిగానే వాదిస్తాడు. ఆమె తత్తరపాటుగా సమాధానం చెబుతుంది. ఈ విషయం మేథావులు అయిన జడ్జికి అర్థమయిపోతుంది కదా. ఆమె తప్పుడు కేసు పెట్టిందని. మరి అప్పుడే సమస్య సాల్వ్ అయినట్లేకదా. కానీ సినిమాపరంగా చూపాలంటే ఇంకా పొడిగించాలి. అదే జరిగింది.
అలా జరుగకూడదు..
'అలాంటి అమ్మాయిలకు, అలాగే జరుగుతుంది' అని బోనులో నించున్న 'నేరస్థుడు' గట్టిగా అరిచినప్పుడు, "అలా జరగకూడదు. జరగడానికి వీల్లేదు" అని వకీల్ సాబ్ మరింత ఆవేశంగా అంటాడు కదా? అదే అసలు పాయింట్. ప్రొవకేషన్‌కు గురైన ఆ కుర్రాడి వాగుడంతా పూర్తయ్యాక, 'సరిగ్గా జరిగిందదే యువరానర్' అని డిఫెన్స్ లాయర్ తన వాదనలు ముగించడమే ఈ కథలో అద్భుతమైన క్లైమాక్స్.
పల్లవిని కేసు గురించి వాదించే ముందు మీ తల్లిదండ్రులు ఏంచేస్తారు. మీరేమి చేస్తుంటారు ముందు అంటూ రకరకాలుగా అడుగుతాడు. అదే ప్రశ్నను వకీల్‌సాబ్ కుర్రాడిని అడుగుతూ.. మీ ఇంటిలో లేడీస్ మందు కొడతారా? అని అడుగుతాడు. మా లేడీస్ గురించి మీకెందుకు? అలాంటి సాంప్రదాయం మాకు లేదు. మాదంతా కట్టుబాట్లు గల ఫ్యామిలీ అని బదులిస్తాడు. ఆ వెంటనే వకీల్‌సాబ్.. ఎం.పి. కొడుకు సోదరి మందు తాగుతున్న ఫొటో చూపిస్తాడు. దాంతో పిచ్చిగా అరుపులు కేకలతో రెచ్చిపోతాడు అతడు. అంటే బయట అమ్మాయిలు అలా చేస్తే తప్పా? తన ఇంటివారు చేస్తే తప్పుకాదా. అందుకే పెద్దలు అన్నట్లు.. తను చేస్తే శృంగారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అని.
ఇండిపెండెంట్ యాటిట్యూడ్స్ స్థానంలో సెంటిమెంట్స్‌ను బలంగా చూపించే ప్రయత్నం జరిగింది. అమ్మాయిలు చక్కగా గుడికి వెళ్తుంటారు. హారతులు పడతారు. అమ్మానాన్న చూపించిన సంబంధానికి ఓకే చెబుతారు. బాయ్‌ఫ్రెండ్ ఫ్యామిలీతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ, ఇలాంటి 'ఆదర్శ మహిళలకు' అన్యాయం జరిగితేనే మన గుండె స్పందిస్తుందా? భార్య లేని మగాడిని ప్రేమించి, అతడి ఇంటి వంట గదిలో కబుర్లు చెబుతూ కనిపించే అమ్మాయిని మనం చులకనగా చూస్తామా? కథలోని అసలు పాత్రలకు బదులు 'మోడల్ సిటిజెన్స్' లేదా సాంప్రదాయిక మగువలను ప్రొజెక్ట్ చేయడమనే మార్పు వల్ల ఈ ప్రశ్నలకు జవాబులు లభించవు.
స్టార్ హీరో వర్సెస్ స్టోరీ
స్టార్ హీరో స్టార్ హీరోగానే వుండాలి. ప్రేక్షకులు, అభిమానులు అలా మారిపోయారు తెలుగులో. రజినీ, రజినీలాగే కనిపించాలి, చిరంజీవి చిరంజీవిలానే ఉండాలి. పవన్ కల్యాణ్ పవర్ స్టార్‌లానే ఉండాలి. వారి రూపం, శక్తియుక్తులు, స్వభావాలు, లక్షణాలు సినిమా సినిమాకు పెద్దగా ఏమీ మారవు. వాళ్ల చుట్టూ ఉండే పాత్రల కథలే కొద్దిగా మారుతుంటాయంతే. చిరంజీవి ఆపద్బాంధవుడు అని తీస్తే జనాలకు రుచించలేదు. రుద్రవీణ తీసిని నిర్మాత చేతులు కాల్చుకున్నాడు. మరలా 150 సినిమాలో రత్తాలు.. అంటూ డాన్స్ వేస్తే జనాలు తెగ చూశారు. రజనీకాంత్ `బాషా` అంటే ట్రెండ్ సెట్ అయింది. `బాబా` తీస్తే బేజారయింది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా కొన్ని వున్నాయి. అందుకే రాజకీయ నాయకుడిగా నలుగురి మంచి చెప్పేవాడిగానే వుంటే జనాలు చూస్తారు. లేదంటే క్లాస్ పీకుతున్నాడంటూ చురకలు వేస్తారు. కొత్తదనం కోసం దర్శక నిర్మాతలు ఎప్పుడూ ముందుంటాం. అలా తీస్తే కొత్తవారితోనే ప్రయోగం చేయాలి. ఇమేజ్ వున్నవారితో కాదని నిర్మాత దిల్‌రాజు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.