ప్రతీకారం నేపథ్యంలో దృష్టి లోపం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన ప్రేమకథగా కాబిల్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 26వ తేదీన సినీ యూనిట్ విడుదల చేసింది. విడుదలైన 48 గంటల్లోనే పది లక్షల వ్యూస్ కొట్టేసింది. ఈ సందర్భంగా తమ సినిమా ట్రైలర్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు సినీ యూనిట్ ధన్యవాదాలు తెలిపింది.
ట్రైలర్ తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తుండగా, దీనికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.