సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొంతమంది అభిమానులు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనే సెక్సీ నటి కాజల్ అగర్వాల్ విషయంలోనూ జరిగింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఇటీవల ఓ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ కూడా వచ్చింది.
ఈవెంట్లో అభిమానులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనితో ఓ అభిమాని లేచి... కాజల్ అక్కా, ఐ లవ్ యూ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. అక్కడున్న వారంతా ఈ మాట విని షాక్ తిన్నారు. ఐతే కాజల్ అగర్వాల్ వెంటనే తేరుకుని అక్కా అంటూనే ఐ లవ్ యూ అని ఎలా చెప్తావు అంటూ ప్రశ్నించింది. దీనితో అక్కడున్నవారంతా గొల్లుమంటూ నవ్వేశారు.