కాల భైరవ గాత్రంతో ది లెజెండ్ ఆఫ్ హనుమాన్

డీవీ

గురువారం, 11 జనవరి 2024 (15:29 IST)
The Legend of Hanuman Season 3
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 కోసం హనుమాన్ చాలీసా అన్ష్ వెర్షన్ కొరకు తన గాత్రాన్ని ప్రముఖ గాయకుడు కాల భైరవ  అందించడం ద్వారా కొత్త ప్రాముఖ్యతను తీసుకొచ్చారు. హనుమాన్, రావణుడి మధ్య తీవ్రమైన ముఖాముఖిని కలిగి ఉన్న, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ యొక్క కొత్త సీజన్ త్వరలో విడుదల కానుంది, డిస్నీ+ హాట్‌స్టార్ పవిత్ర హనుమాన్ చాలీసా యొక్క హృదయపూర్వక వెర్షన్ ను ఆవిష్కరించింది. ఈ పాటను నిర్మించడమే కాకుండా తన గాత్రాన్ని అందించిన ప్రముఖ గాయకుడు కాల భైరవ ప్రతిభతో కూడిన ఈ సంగీత ప్రదర్శనలో PVNS రోహిత్, మనోజ్ శర్మ, అరుణ్ కౌండిన్య, హైమత్ మహమ్మద్, లోకేశ్వర్, రవి ప్రకాష్, సాయి సాకేత్‌లు కూడా తమ గాత్రాన్ని అందించారు.
 
డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రసారం కానున్న ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3ని గ్రాఫిక్ ఇండియా మరియు శరద్ దేవరాజన్, జీవన్ జె. కాంగ్ మరియు చారువి అగర్వాల్ లు నిర్మాతలుగా వ్యవహరించారు, ప్రఖ్యాత కళాకారుడు శరద్ కేల్కర్ రావణ్‌కి గాత్రదానం చేశారు. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3లో హనుమంతుడు అచంచలమైన భక్తి మరియు సాటిలేని బలాన్ని వ్యక్తపరుస్తూ, అతని పురాణ విజయాలు మరియు ఉల్లాసకరమైన సాహసాలను వీక్షిస్తూ దృశ్యమాన ప్రయాణాన్ని ప్రారంభించండి. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా జనవరి 12, 2024 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు