స్వతహాగా రచయిత అయిన కరుణ కుమార్ కథలను నమ్ముకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కళాపురం అలా రూపొందిన సినిమానే. సినిమా ప్రపంచం చుట్టూ చాలా కథలుంటాయి. వాటిలో చాలా భావోద్వేగాలుంటాయి. సినిమా తీయాలనే కోరక, అందులో నటించాలనే కోరిక , నిర్మించాలనే కోరకలతో చాలామంది సినిమా దునియాలో పరుగులు పెడుతుంటారు. కోరిక ఉంటే సరిపోతుందా అందుకు తగిన అర్హత ఉండాలిగా..? అదే కళాపురం సినిమా కథలో కరుణ కుమార్ వేసిన ప్రశ్న..?
కరుణ్ కుమార్ రైటర్ గా, దర్శకుడిగా కళాపురం లో క్రియేట్ చేసిన సన్నివేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రగులింగ్ ప్రొడ్యూసర్ గా నటించిన జనార్దన్, సత్యం రాజేష్ కాంబినేషనల్ సీన్స్ చాలా నవ్వులు కురింపించాయి. కొత్త కథలు, కథనాలను నమ్ముకొని ఒక పాత్రలకు తగిన ఆర్టిస్ట్ లను ఎంచుకొని దర్శకుడు కరుణ కుమార్ చేసిన ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంది. గట్టోడికి గడ్డి పరక దొరికినా గడ్డపారగా వాడతాడు అనే డైలాగ్ సినిమా మేకింగ్ లో కూడా కనిపిస్తుంది.
చిత్ర పరిశ్రమ ఉండే మోసాలు, కష్టాలపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కళాపురంకూడా అదే కోవకు చెందినదే. కాకపోతే కరుణ కుమార్ ఈ సినిమాతో అంతర్లీనంగా చెప్పిన కథ, చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారు. పేరున్న నటీనటులు లేకపోవడం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోయింది. ఎలాంటి అశ్లీలత లేకుండా చక్కటి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు.