'పేజెస్' చిత్రాన్ని హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషలలో రూపొందిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ చితమిది. ఇందులో కల్పనా తివారీ ప్రధాన పాత్రలో నటించారు.
'పేజెస్' గురించి దర్శకుడు రామ్ అల్లాడి మాట్లాడుతూ... ''సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న వ్యత్యాసం మా చిత్రంలో మరో ప్రధాన అంశం. స్వాతంత్య్రానంతర పరిణామాల వల్ల ప్రభావితమైన ఒక రాజకీయ కుటుంబం నేపథ్యంలో సాగే కథ ఇది. ఢిల్లీ, భారత - పాకిస్తాన్ సరిహద్దు, బంగ్లాదేశ్ లోని నవఖాలి, తెలంగాణ ప్రాంతాలలో ముడిపడిన కథ ఇది. రెండు దశాబ్దాల నా ప్రవాస భారతీయ జీవితం నన్ను కథ రాయడానికి ప్రభావితం చేసింది. ఇది పూర్తి స్థాయి కల్పిత కథ. ఈ చిత్రంలో కల్పనా తివారీతో పాటు మరో ముగ్గురు మహిళలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తాయి'' అని అన్నారు.
తారాగణం: కల్పనా తివారీ, పంకజ్ మున్షీ, ఆనంద్ రంగరాజన్, శిల్పా దాస్, ప్రసాద్ కమలనాభ, రవి వైద్, నీహరి మండలి, సుమంత ముఖర్జీ, విజయ మేరీ, మధు గుంటుపల్లి, అరుణశ్రీ సాదుల, నంద కిషోర్, దావూద్, యశ్వంత్ సాదుల, వి రాజనీత మధే, వి. ఎరుగురాల, సయ్యద్ మునీబ్, రోహిత్ సత్యన్, కె. భావన, కృష్ణ గోదా, సాయిబాబా యెంగల్దాస్, రామ్ వంగా & ఇతరులు.
సంగీతం: శ్రీవర్ధన్ సాయి, ఎడిటర్: రుద్ర అల్లాడి, సినిమాటోగ్రఫీ: రామ్ అల్లాడి, కృష్ణ గుంటుపల్లి, డైలాగ్స్: దీప్తి గంగరాడే, దేవేష్ కుమార్ రాథోడ్, కథ, దర్శకత్వం: రామ్ అల్లాడి, నిర్మాణ సంస్థ: ఏ.ఆర్.ఐటి వర్క్స్ ఇండియా.