Kalyanram, vijayasanthi, ntr
ఎన్.టి.ఆర్. మాట్లాడుతూ, కర్తవ్యంలో పోలీస్ ఆపీస్ కు కొడుకుపుడితే అక్కడనుంచే అర్జున్.. సినిమా ప్రారంభం అవుతుందనిపిస్తుంది. ఇదే స్టేజీపై నాన్నగారితో కలిసి మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆలోటును విజయశాంతిగారు తీర్చారు. భారతదేశంలో ఎవరినీ దక్కని నటిగా విజయశాంతిగారికి దక్కింది. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు కానీ ఆమె చేసిన ప్రతి సినిమా భిన్నమైంది. ఇక ఈ సినిమాలో ఆఖరి 20 నిముషాలు ప్రేక్షకుడిని కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఈ సినిమా చూశాను. ఈ సినిమాతో అన్న కళ్యాణ్ కాలర్ ఎగరేస్తాడు. అన్న కెరీర్ లో మైలురాయిలా నిలుస్తుంది. విజయశాంతిగారు లేకపోతే అలా నటన చేసేవాడు కాదేమోనని అనిపించింది. నాన్నగారు వున్నప్పుడు మరో జన్మ వుంటే మళ్ళీ కొడుకుగా పుడతానని చెప్పారు. ఇప్పుడు మీరే నా అభిమానులు. త్వరలో మరలా కలుద్దాం. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనంగా వుండాలి అన్నారు.