జాతీయ నటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు వేడుకలను ముందుగానే చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు నవంబర్ 7. కాగా, తాజాగా ఆయన `విక్రమ్` సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ జరుగుతున్న ఓ మాల్ లో అభిమానుల సమక్షంలో ముందుగానే చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది. 24 శాఖల్లోని దాదాపు అన్నింటిలోనూ కమల్‌కు పట్టు వుందని ఆ చిత్రయూనిట్ ఈ సందర్భంగా పేర్కొంది.