అనంతరం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుపుకున్నారు. వారి సూచనల మేరకు డిసెంబర్ 3వరకు అసొలేషన్‌లోనే వుండాలనడంతో ఆయన అలానే వున్నారు. ఈరోజు అనగా బుధశారంనాడు ఆసుప్రతినుంచి బులిటెన్ వెలువడింది. మెడికల్ డైరెక్టర్ సురేష్ ప్రభాకర్ తెలుపుతూ, కమల్‌హాసన్ పూర్తిగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఫిట్‌గా వున్నారని వెల్లడించారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి యథావిథిగా తన వర్క్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.