కమల్‌కు మరోమారు ఆపరేషన్... చూసేందుకు వెళ్లిన రజినీకి నిరాశ!

సోమవారం, 1 ఆగస్టు 2016 (11:30 IST)
పద్మభూషణ్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవలే మెట్లపై నుంచి జారిపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనని కుటుంబ సభ్యులు చెన్నై మౌంటురోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న ఆయన కాలు మళ్లీ నొప్పిపుడుతుండటంతో వైద్యులు ఆదివారం మరోసారి ఆపరేషన్ చేశారు. 
 
ఆసుపత్రిలో ఉన్న ఆయనని పరామర్శించాలని వెళ్లిన సూపర్ స్టార్ రజినీకాంత్‌కు నిరాశే ఎదురైంది. రజనీకాంత్ చాలా సేపు ఆయన కోసం వేచి యుండగా... ఆపరేషన్ జరిగినందున కలిసేందుకు వీలుపడదని వైద్యులు అన్నారు. ఇక చేసేదేమీ లేక కమల్‌కు స్పృహ వచ్చిన తర్వాత రజినీ ఫోన్‌లోనే మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వీలైనంత త్వరలోనే ఇంటికొస్తానని కమల్‌హాసన్‌ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి