కానీ, సినిమాను ప్రేక్షకులు అనుకున్నట్లు పూర్తిగా తీయలేకపోయారనే విమర్శ వుంది. అందరూ సినిమా చూశాక పాజిటివ్‌గా చాలామంది స్పందిస్తే నెగెటివ్ గా మరికొందరు స్పందించారు. వారందరికీ నేను చెప్పేదొకటే మేం అనుకున్నట్లు సినిమా తీశాం. మీరనుకున్నట్లు ఎందుకు తీస్తామని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే మొదటి భాగంలో కంగనా పాత్ర ఓకే అనిపించుకున్నా, రాజకీయాలల్లో వెళ్ళాక ఆ పాత్ర సూటు కాలేదని చాలామందిలో నెలకొంది. కంగనా పాత్రకు పలువురు హీరోయిన్లను సంప్రదించారు. అందులో విద్యాబాలన్ కూడా వుంది. కానీ ఎవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేమనీ, చేశాక తమిళనాడులో వ్యతిరేక వస్తుందని భయపడినట్లు తెలిసింది. అందుకే కంగనాను ఖరారుచేశారు. ఆమె కూడా మొదట్లో చేయనని చెప్పింది. కానీ దర్శకుడు విజయ్ ఆమెను ఒప్పించేలా చేశారు. ఇది జయలలిత బయోపిక్ అనే కంటే ఎంజీఆర్ పార్షియల్ బయోపిక్ అనడం కరెక్ట్.