కన్నడ నటి సౌజన్య ఆత్మహత్య.. అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని..?

గురువారం, 30 సెప్టెంబరు 2021 (19:11 IST)
Soujanya
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో టివి నటి ఆత్మహత్య చేసుకుంది.
 
కన్నడ నటి అయిన సౌజన్య పలు టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయ్యారు. ఆమె తన రూమ్‌లో ఆత్మహత్యకు చేసుకున్నారు. సౌజన్య ఆత్మహత్య వెనుక కారణాలు ఏంటీ? రూమ్‌లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. 
 
25ఏళ్ల వయసు ఉన్న సౌజన్య బెంగళూరులోని కుంబల్‌గోడులోని తన అపార్ట్‌మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సూసైడ్ లెటర్ లో తన చావుకు ఎవరూ కారణం కాదని.. తన జీవితంపై తనకు విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది.
 
ఆమె తన తల్లిదండ్రుల నుండి క్షమాపణ కూడా కోరింది. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ, ఆమె జీవితంలో ఎదుర్కొన్న దానితో ఆమె మానసికంగా బాధపడుతుందని నోట్‌లో పేర్కొంది. ఈ విషయంపై పూర్తిగా తెలియాల్సి ఉంది. సౌజన్య మరణ వార్తతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. మరో వైపు సౌజన్య ఆత్మహత్య పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు