ప్రియుడి మోజులో పడి భర్తను చంపించిన భార్య!!

ఠాగూర్

మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (14:57 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తను హత్య చేయించింది. జిల్లాలోని ఆస్పరి మండలంలో ఈ దారుణం వెలుగు చూసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన పద్మావతి... అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమలో తన భర్తను హత్య చేయాలని ప్రియుడు చెన్నబసవను కోరింది. 
 
ప్రియురాలి మాటలతో హత్యకు సిద్ధమైన చెన్నబసవ.. ఇందుకోసం బెంగుళూరు నుంచి తొగలగల్లుకు వచ్చారు. పక్కా ప్రణాళికతో, సెప్టెంబరు 3వ తేదీన తొగలగల్లు, దొడకొండ గ్రామాలకు మధ్య ఉన్న డంపింగ్ యార్డు వద్ద ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడుని అహోబిలంగా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
ఈ విచారణలో భాగంగా భార్య పద్మావతిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతోనే హత్య చేసినట్టు వెల్లడించారు. పద్మావతి ఇచ్చిన సమాచారంతో ఆమె ప్రియుడు చెన్నబసవను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు