దీపావళికి సినీ ప్రేక్షకులకు పండుగే. దీపావళి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మంచు విష్ణు నటించిన జిన్నా మూవీపై విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అలాగే విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. హీరో కార్తి నటించిన సర్దార్ సినిమా కూడా ఈ రేస్‌లో ఉంది. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమా కూడా దీపావళికి రానుంది. అయితే జిన్నా తప్పకుండా దీపావళికి హిట్ కొడుతుందని సినీ ప్రేక్షకులు అంటున్నారు.