ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాట వీడియోలో కాల్ళకు గజ్జలు కట్టుకుని హీరోయిన్ డాన్స్ వేస్తుండగా వాటిని ఆలపిస్తూ సాగే పాట. వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రుతిహాసన్ కూచిపూడి నాట్యం చేస్తుండగా చిత్రీకరించిన ఈ పాటను అమన్ మాలిక్, దీపూ, గీతామాధురి తదితరులు ఆలపించారు. ఇది ఇప్పటికే ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇదిలా వుండగా, ఈసినిమా ఈవెంట్‌ను యూసుఫ్‌గూడాలో చేయనున్నారు.