'రంగ్ దే' శ్రీ మణి గీతం

సోమవారం, 15 మార్చి 2021 (07:39 IST)
Rang De
‘నితిన్, కీర్తి సురేష్‘ ల 'రంగ్ దే' చిత్ర లోని మరో గీతం ఈరోజు  విడుదల అయింది. కథానుసారం చిత్ర కథా నాయకుడు పరిచయ గీతంగా కనిపించే, వినిపించే ఈ సందర్భోచిత గీతం వివరాల్లోకి వెళితే,
" సన్ లైట్ ను చూసి నేర్చుకుని ఉంటే 
ఫుల్ మూన్ కూల్ గా ఉండేవాడా
క్లాస్ మేట్  ని చూసి నేర్చుకుని ఉంటే
ఐన్ సైంటిస్ట్  అయ్యే వాడా....?"
అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు డేవిడ్ సీమన్ గాత్రంలో ఈ గీతం హుషారుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు ముఖ్యంగా యువతను, అలాగే సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. నితిన్ తో పాటు చిత్రంలో అతని మిత్రులు అభినవ్ గోమటం, సుహాస్ బృందంపై శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఈ గీతాన్ని వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి.
 
చిత్ర కథానుసారం కథానాయకుడు పరిచయ గీతం గా ఇది వస్తుంది అని తెలిపారు గీత రచయిత శ్రీ మణి. చిత్రంలోని ప్రతిపాట సందర్భ శుద్ధి గానే సాగుతాయి. కథను చెబుతాయి. ఈ పాట కూడా అంతే. దర్శకుడు వెంకీ గారు చిత్రం లో పాట కు ఉండే సందర్భాన్ని వివరించే తీరు  పాటలు ఇంత బాగా రావటానికి కారణం ఆన్నారు శ్రీ మణి. 
 
'రంగ్ దే' చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం వరుసగా విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, లిరికల్ వీడియో గీతాలు మరింత పెరిగేలా చేస్తూనే ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు