ఈమె తాజాగా నటించిన చిత్రం "వీర్ ది వెడ్డింగ్". ఇటీవల విడుదలైన ఈ బాలీవుడ్ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో పెళ్లయితే హీరోయన్లకు ఛాన్సిలివ్వరన్న ప్రశ్నపై ఆమె స్పందించారు. 'పెళ్లయితే అవకాశాలు రావన్నారు. కాని అది తప్పని రుజువు చేశాను. నాకు ఇప్పుడు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాని నేను నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తనకు 'నా మొదటి ప్రాధాన్యత కుమారుడు, భర్త, ఫ్యామిలీనే అన్నారు. ఆ తర్వాతే సినిమాలని అన్నారు. ఈ విధంగా సినిమాలు, పర్స్‌నల్ లైఫ్‌లను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు ఫైనలైజ్ చేయాల్సి ఉందని అన్నారు. భార్యాభర్తలమిద్దరం అటు సినిమాలను ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమతూకం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నాని చెప్పుకొచ్చారు.