హాలీవుడ్లో నటించాలంటే ఎంతో ధైర్యం, పట్టుదల, ఏకాగ్రత కావాలని, అవన్నీ తనలోనే ఉన్నాయని ప్రియాంక చోప్రా నిరూపించిందని కత్రినా కితాబిచ్చింది. దీనిమీద ప్రియాంక చోప్రా ఏకంగా ఓ పుస్తకం రాయాలని కత్రినా సూచించింది. ఇకపోతే.. ఫితూర్ సినిమాలో కత్రినా కైఫ్‌తో పాటు ఆదిత్యా రాయ్ కపూర్, తబు తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కత్రినా మాట్లాడుతూ.. తనకు మొదటి ఫ్రెండ్ ఇండియన్ అబ్బాయేనని టీనేజ్ సంగతుల్ని గుర్తు తెచ్చుకుంది. ఇంకా రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్, సల్మాన్ ఖాన్‌తో ప్రేమాయాణం మొదలెట్టిందంటూ వచ్చిన వార్తలపై అమ్మడు దాటవేసింది.