రజనీకాంత్‌కు ఆపరేషన్ సక్సెస్ : మీడియా బులిటెన్

శుక్రవారం, 29 అక్టోబరు 2021 (15:38 IST)
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి శుక్రవారం మధ్యాహ్నం తాజా బులెటిన్ విడుదల చేసింది. 
 
చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో గురువారం చేరారని, తల తిరుగుతుండడంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. రజనీకాంత్‌ను నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలించిందని, ఆయనకు కరోటిడ్ ఆర్టెరీ రీవాస్కులరైజేషన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. 
 
ఈ క్రమంలో నేటి ఉదయం ఆయనకు రీవాస్కులరైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. మరికొన్నిరోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆ బులెటిన్‌‍లో వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు