తెలుగు అమ్మాయిలు దొరకరు అన్న నాని అందుకే కీర్తి సురేష్ ఎంపిక

బుధవారం, 29 మార్చి 2023 (18:17 IST)
keerthy suresh
దసరా సినిమాకు హీరో నానికి కథ చెప్పాక హీరోయిన్ గా తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని ట్రై చేసాం. కానీ నాని మీకు  తెలుగు అమ్మాయిలు దొరకరు అన్నారు. ఆయన అన్నట్లుగానే ఎంతో మందిని ట్రై చేసాం కుదరలేదు అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పారు. తెలుగులో చాలామంది ఉన్నారుకదా ట్రై చేయాల్సనిది అనగా ఆయన చెప్పిన సమాదానం. ఫైనల్గా కీర్తి సురేష్ ను ఎంపిక చేశామని అన్నారు. 
 
కీర్తి సురేష్ ఒకసారి చెప్పగానే పట్టేస్తుంది అంటూ కితాబు ఇచ్చారు. తానే డబ్బింగ్ చెప్ఫన్దని అన్నారు.  ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు