అజయ్ దేవగన్‌కు జోడీగా బాలీవుడ్‌కు కీర్తి సురేష్...

బుధవారం, 13 మార్చి 2019 (13:50 IST)
ఒకప్పటి నటి మేనక నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ మహానటి సావిత్రి సినిమాతో తనదంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకొని దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ‘మహానటి సావిత్రి’ సినిమాలోని నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు సైతం కీర్తి అందుకోవడం విశేషమనే చెప్పుకోవాలి. తన అందం, అభినయంతో అటు తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్.. ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు.
 
వివరాలలోకి వెళ్తే... ప్రస్తుతం ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్న అజయ్ దేవగన్.. ఈ చిత్రం తర్వాత ఒక బయోపిక్‌లో నటించనున్నారు. 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ నటించనున్నారట. ఈ బయోపిక్‌కు ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసారట. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ప్రముఖ మూవీ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు